బొబ్బిలి శ్రీసూర్య విద్యాలయంలో విద్యార్థుల కోసం మెడిటేషన్ క్లాస్
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని శ్రీ సూర్య విద్యాలయంలో ప్రిన్సిపాల్ ఆహ్వానం మేరకు బ్రహ్మకుమారీస్ సెంటర్ ఇంచార్జ్ రాజేశ్వరి అక్కయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక మెడిటేషన్ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెబ్బై ఐదు మంది విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజయోగ అభ్యాసం, ఒత్తిడిని అధిగమించడం, జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం మరియు సానుకూల ఆలోచనల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. సమాజంలో నైతిక విలువలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.