తెలంగాణలో మద్యం ఏరులై పారుడు: పందొమ్మిది రోజుల్లో రెండు వేల కోట్లు దాటిన విక్రయాలు
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
తెలంగాణలో దసరా పండుగ సీజన్లో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ ఒకటి నుంచి పందొమ్మిది వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రెండు వేల ఐదు కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైందని, గత ఏడాదితో పోలిస్తే ముప్పై ఏడు శాతానికి పైగా వృద్ధి నమోదైందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.