నరసన్నపేట హైవేపై లారీలు ఢీకొని అగ్నికి ఆహుతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నరసన్నపేట
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం వైపు నుంచి వస్తున్న లారీ నిలిపివున్న మరో లారీని ఢీకొనడంతో మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన వ్యక్తులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే లారీలు పూర్తిగా కాలిపోయాయి.