బైక్ ట్యాక్సీలపై ప్రభుత్వ నిర్ణయం: యువత పొట్టకొట్టే చర్యలంటూ కవిత మండిపాటు

రిపోర్టర్: సురేష్ స్థలం: నిజామాబాద్

పెరుగుతున్న ధరలకు తగ్గట్టు ఆదాయం లేక అదనపు ఆదాయం కోసం ఓలా, ర్యాపిడో, బ్లింకిట్, స్విగ్గీ వంటి సంస్థల్లో బైక్ ట్యాక్సీలు నడుపుకుంటున్న యువతి యువకుల పొట్టగొట్టే చర్యలకు పాల్పడుతున్నది ప్రభుత్వం అని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బైక్ ట్యాక్సీలకు పసుపు నంబర్ ప్లేట్లు తప్పనిసరి చేసే ప్రతిపాదనపై పార్ట్ టైమ్ రైడర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అదనపు భారం మోపుతూ వారి జీవనోపాధిని దెబ్బతీసే ఇటువంటి విధానాలను తక్షణమే విరమించుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.