చింతపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నిలువునా దగ్ధమైన ఇల్లు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: చింతపల్లి
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం ఎర్రవరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బేర లింగమ్మ ఇల్లు పూర్తిగా కాలిపోయిందని గ్రామస్థులు తెలిపారు. బాధితురాలికి జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.