దిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: సీఈసీ తొలగింపు కోరుతూ నిరసనలతో స్తంభించిన రద్దీ మార్గాలు
రిపోర్టర్: రాము
స్థలం: దిల్లీ
ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తొలగింపు డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దిల్లీలో కొనసాగుతున్న నిరసనల కారణంగా ఆదివారం రెండో రోజు కూడా తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నట్లు దిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. జంతర్‌మంతర్, కన్నాట్ ప్లేస్ ప్రాంతాలలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రోజువారీ ఆందోళనలు కొనసాగుతాయని నిర్వాహకులు స్పష్టం చేశారని అధికారులు వెల్లడించారు.