మహిళల రక్షణ కోసం జిల్లాలో జెండర్ రిసోర్స్ సెంటర్లు
రిపోర్టర్: వెంకట్
స్థలం: నెల్లూరు
మహిళల ఆర్థిక స్వావలంబనతో పాటు గృహ హింస బాధితులకు తక్షణ న్యాయ సహాయం అందించేందుకు నెల్లూరు జిల్లాలో జెండర్ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ సహకారంతో ఎంపిక చేసిన పదకొండు మండలాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పినట్లు పేర్కొన్నారు. వేధింపులకు గురవుతున్న మహిళలను ఆదుకోవడానికి ఒక్కో కేంద్రానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు.