వైకాపా తప్పుడు ప్రచారం బట్టబయలు: ఎస్సైపై దుష్ప్రచారాన్ని ఖండించిన పోలీసులు
రిపోర్టర్: సురేష్
స్థలం: జమ్మలమడుగు
జమ్మలమడుగు పట్టణంలో ఎస్సై హైమావతి వైకాపా ఛైర్పర్సన్ అభ్యర్థి చీర లాగారంటూ సామాజిక మాధ్యమాల్ లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని పోలీసులు తీవ్రంగా ఖండించారు. అసలు ఆ ఘటనలో ఎలాంటి నిజం లేదని, వైకాపా నాయకులు కావాలనే తప్పుడు చిత్రాలతో దుష్ప్రచారానికి దిగుతున్నారని అధికారులు స్పష్టం చేశారు. ఛైర్పర్సన్ అభ్యర్థి వెనుక ఉన్న వ్యక్తి చేయిని మాత్రమే ఎస్సై లాగుతున్నట్లు ఆ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడిస్తూ, ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.