టాలీవుడ్ ఇరుముడి సినిమాకు లేబర్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

బాలనటి నక్షత్ర పనివేళలు, భద్రతపై జై లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు సీ మహేష్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగా మైత్రీ మూవీ మేకర్స్ కు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. నవంబర్ నాలుగో తేదీన విచారణకు హాజరు కావాలని రంగారెడ్డి జోన్ జాయింట్ కమిషనర్ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. అనుమతులు, వేతనాలు, రక్షణ చర్యలపై అన్ని రికార్డులు సమర్పించాలని చిత్ర నిర్మాణ సంస్థను ఆదేశించారు.