నేటితో ముగియనున్న కొత్త చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో కొత్త చేయూత పింఛన్ల దరఖాస్తుల గడువు ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. వరుస సెలవుల కారణంగా ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గడువును పొడిగించింది. అర్హులైన లబ్ధిదారులు ప్రజాపాలన లేదా మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.