మౌలిక సదుపాయాలు కల్పించాలి.. సీపీఐఎంఎల్ ధర్నా

రిపోర్టర్: AMPAIAH ACHARI స్థలం: ఎమ్మిగనూరు

ఎమ్మిగనూరు 14వ వార్డులో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో మునిసిపల్ అధికారులు విఫలమయ్యారని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వీధి దీపాలు, తాగునీటి కుళాయిలు, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. సత్యన్న డిమాండ్ చేశారు.

వంకను శుభ్రం చేసి విషసర్పాలు, ప్రమాదకర జంతువులు నివాస ప్రాంతాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.