అక్షరాస్యతపై లోకేష్ లెక్కలు తప్పు: మాజీ సీఎం జగన్ ఫైర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీ అక్షరాస్యతపై మంత్రి లోకేష్ చేస్తున్న ప్రచారం అవాస్తవమని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. 2025లో అక్షరాస్యత 71.4 శాతంగా ఉంటే, 82.1 శాతంగా ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర గణాంకాలకు, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు పొంతన లేదని విమర్శించారు. రెడ్ బుక్ పాలన పక్కన పెట్టి, పేద విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, తప్పుడు ప్రచారాలు ఆపాలని జగన్ ఘాటుగా హెచ్చరించారు.