శాసనసభ స్పీకర్కు సంఘీభావం తెలిపిన ఎంపీ మల్లు రవి మరియు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రాంతానికి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీలో నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవితో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలి సభ్యుడు తాతా మధు స్పీకర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్కు సంఘీభావం తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు.