బొబ్బిలిలో అచ్చీవర్ స్టడీ హాల్ సందర్శించిన ఎమ్మెల్యే బేబీనాయన
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు అచ్చీవర్ స్టడీ హాల్‌ను సందర్శించారు. డీఎస్సీపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన యువతకు సూచించారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతోందని, యువత తమ శ్రమను నమ్ముకుని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. ప్రభుత్వం యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తోందని, దశలవారీగా వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.