నకిలీ మందులు కార్పొరేట్ వలలపై ఫార్మసిస్ట్ జగన్నాధ కుమార్ హెచ్చరికల కలకలం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నమ్మకమైన ఆసుపత్రి, వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని, రోగ నిర్ధారణ పరీక్షలను విశ్వసనీయ ల్యాబ్లలో చేయించుకోవాలని సీనియర్ ఫార్మసిస్ట్ కందుల జగన్నాధ కుమార్ సూచించారు. వైద్యులు సూచించిన మందులను నాణ్యత కలిగిన ఫార్మసీలలో కొనుగోలు చేయాలని తెలిపారు. కార్పొరేట్ ప్రచారాలకు ఆకర్షితులు కాకుండా మందుల ధరలు, నాణ్యతపై అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.