పెళ్లి తర్వాత తొలిసారి: భర్తతో కలిసి ఘనంగా కర్వా చౌత్ జరుపుకున్న మెహ్రీన్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
పెళ్లయిన జంటలు ఘనంగా జరుపుకునే కర్వా చౌత్ పండగను తాజాగా హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా పెళ్లి తర్వాత మొదటిసారి తన భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వేడుకకు సంబంధించిన పలు సుందరమైన ఫోటోలను ఆమె తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ చిత్రాలు అంతర్జాలంలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.