వీపనగండ్ల ఊరచెరువులో అక్రమ మోటార్లు: మూగజీవాల దాహార్తిపై అధికారులకు రైతుల ఫిర్యాదు
రిపోర్టర్: అశోక్
స్థలం: వనపర్తి
ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువుల్ లో నీరు ఇంకిపోగా, ఊర చెరువులోని నీటిని కొందరు రైతులు అక్రమంగా మోటార్ల ద్వారా తరలిస్తున్నారని వీపనగండ్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూగజీవాల దాహార్తిని తీర్చేలా చెరువులో ఏర్పాటు చేసిన అక్రమ మోటార్లను వెంటనే తొలగించాలని కోరుతూ సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు.