బెంగళూరు వరకు వందేభారత్ ఎక్స్ప్రెస్ పొడిగింపునకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: హరి
స్థలం: బెంగళూరు
మంగళూరు-మడ్గావ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును బెంగళూరు వరకు పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు కర్ణాటకకు చెందిన ఎంపీలు బ్రిజేష్ చౌటా, విశ్వేశ్వర హెగ్డే కాగేరికి ఆయన లేఖ రాసినట్లు తెలిపారు. ఈ పొడిగింపు ద్వారా బెంగళూరు నుంచి మంగళూరు, గోవా మధ్య ప్రయాణికుల చిరకాల డిమాండ్ నెరవేరనుందని అధికారులు పేర్కొన్నారు.