ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన నీరు దండా

రిపోర్టర్: గోపి స్థలం: హర్యానా

ఆసియా క్రీడల మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ నీరు దండా స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారని అధికారులు తెలిపారు. హర్యానాకు చెందిన ఇతను ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ కాంటినెంటల్ రికార్డును బద్దలు కొట్టారని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలైలో జరిగిన ప్రపంచ కప్లోనూ నీరు దండా పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందేనని నిర్వాహకులు వెల్లడించారు.