'ఆమె తనతో సమానంగా వెళ్తుంటే ఓర్వలేకపోయాడు': కిరణ్ బెడి ఫైర్

రిపోర్టర్: అశోక్ స్థలం: India

గుర్గావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు కల్యాణ్ బైన్సలాను మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ తీవ్రంగా విమర్శించారు. తనతో సమానంగా వేగంగా వెళ్తున్న మహిళను ఆ వ్యక్తి ఓర్వలేకపోయాడని, పురుషాహంకారంతోనే కారుతో ఢీకొన్నాడని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత పారిపోయి, నంబర్ ప్లేట్ తొలగించిన నిందితుడు పిరికివాడని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.