జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనపై పెల్లుబికిన ఆక్రోశం
రిపోర్టర్: AMPAIAH ACHARI
స్థలం: ఎమ్మిగనూరు
పత్తికొండ విశాలాంధ్ర విలేఖరి ఎం. నాగరాజు పట్ల అర్బన్ సీఐ జయన్న దురుసుగా ప్రవర్తించడాన్ని జర్నలిస్ట్ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. బాధ్యుడైన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఐ న్యూస్ ప్రతినిధులపై మోపిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా ప్రవర్తించడం తగదని, వేధింపులు ఆపాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ నాయకులు పాల్గొని తమ నిరసనను తెలియజేస్తూ తక్షణమే సీఐపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.