భక్తుల సౌకర్యార్థం దేశమ్మ ఆలయానికి టేబుళ్లు చైర్ల వితరణ

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

నగరి పట్టణంలోని నేత్రదేవత దేశమ్మ ఆలయంలో ప్రతి మంగళవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి భక్తుల సౌకర్యార్ధం దాతలు టేబుళ్లు, చైర్లు వితరణగా అందించారు. పట్టణ పరిధికి చెందిన లాయర్, పాలక మండలి సభ్యులు సోమసుందరం పది వేల రూపాయలు, టీఆర్ కండ్రిగకు చెందిన సుగుణ పది వేల రెండు రూపాయలు, చెన్నై కేఆర్ ఆవడికి చెందిన భక్తులు ఎనిమిది వేల రూపాయలు అందించి సమకూర్చిన టేబుళ్లు, చైర్లను దాతలు ఆలయ ఈవో మునికృష్ణమూర్తికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు మదన్ కుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.