మాదకద్రవ్యాల నియంత్రణపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ప్రతిభ అభినందనీయం
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ ఫోర్స్ సిబ్బంది చేస్తున్న విశేష కృషిని ఆయన కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేసి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.