పసిడి దిగుమతులపై ఐజీఎస్టీ మినహాయింపు ఎత్తివేత: జీఎస్టీ మండలి కీలక నిర్ణయం

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

దేశీయ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్యాంకులు అలాగే ప్రభుత్వ నామినేటెడ్ ఏజెన్సీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పసిడి, వెండి మరియు ప్లాటినంలపై ఇన్నాళ్లూ ఇస్తున్న ఐజీఎస్టీ మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 8వ తేదీన జరగనున్న కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రుల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వర్గాలు స్పష్టం చేశాయి.