సీబీఎస్ఈ పాఠశాలలకు కొత్త డ్రెస్ కోడ్, రంగులు ఖరారు

రిపోర్టర్: శివ స్థలం: హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్‌లో సీబీఎస్ఈ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులకు నూతన డ్రెస్ కోడ్, పాఠశాల భవనాలకు రంగులను సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఖరారు చేశారు. విద్యార్థులకు ఆకుపచ్చ రంగు యూనిఫామ్, మహిళా ఉపాధ్యాయులకు లైలాక్ పర్పుల్, పురుష ఉపాధ్యాయులకు లైట్ బ్లూ దుస్తులు నిర్ణయించారు. మౌలిక వసతుల అభివృద్ధికి అదనంగా రూ. 5 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.