తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్నారైల సేవలు అవసరం: చంద్ర పెమ్మసాని

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయవాడ

విజయవాడలో జరిగిన గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ ప్రమాణ స్వీకారంలో కేంద్రమంత్రి చంద్ర పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దార్శనికత వల్లే తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలుగా స్థిరపడ్డారన్నారు. అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైల విజ్ఞానం, అనుభవం కీలకమని, వారి సేవలు మరింత అవసరమని పిలుపునిచ్చారు.