పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా కేంద్రం వాటా నగదు జమ

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద రాష్ట్రంలోని పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం అందించే వాటా నగదును ఇక నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. సెర్ప్‌ సీఈవో వాకాటి కరుణ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా వచ్చే నెల నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కేంద్రం ఇచ్చే రూ.200 నుంచి రూ.500 వరకు పోను మిగతా రాష్ట్ర వాటా పింఛను నగదును సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నారు.