కళ్లు మూసుకుంటే ఐదేళ్లు గడిచిపోతాయి: జగన్ వ్యూహంపై చర్చ!

రిపోర్టర్: శివ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం చర్చనీయాంశమైంది. క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయడం మాని, 'కళ్లు మూసుకుందాం.. కాలం గడిచిపోతుంది' అంటూ ఐదేళ్ల కాలాన్ని దాటవేయాలని ఆయన భావిస్తున్నారు. కేవలం పాదయాత్రపైనే నమ్మకం పెట్టుకుని తాడేపల్లికే పరిమితమవడం పార్టీని మరింత బలహీనపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.