ఐపీఈ నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి బాధ్యతల స్వీకరణ
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ విద్యావేత్త, మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ నూతన డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఈ ప్రతిష్టాత్మక అటానమస్ సంస్థ బాధ్యతలు చేపట్టారు. పరిశోధనా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.