'ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు': మంత్రి కొండా సురేఖ

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

తెలంగాణ విముక్తి పోరాటాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. భారత ఐక్యతలో తెలంగాణ భాగస్వామ్యంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వ అభిమతం మేరకు రాష్ట్ర ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక సందేశాన్ని వెల్లడించారు.