వెంకటాపూర్ మండలంలో దళారుల చేతికి ఉచిత సన్నబియ్యం: బ్లాక్‌మార్కెట్‌కు తరలింపు
రిపోర్టర్: రాజేష్
స్థలం: వెంకటాపూర్
వెంకటాపూర్ మండలంలో పేదల కోసం ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకం దళారులు, డీలర్ల చేతిలో అక్రమ వ్యాపారంగా మారుతోందని స్థానికులు ఆరోపించారని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేసి డీలర్‌షిప్‌లు రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.