నెల్లూరులో పురుగుల బియ్యం కలకలం: కాలనీలను ముంచెత్తుతున్న కీటకాలతో జనం అవస్థలు

రిపోర్టర్: నరేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం కేంద్ర గిడ్డంగిలో నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యంలో పురుగులు వృద్ధి చెందడంతో స్థానిక కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి జిల్లాల నుంచి వచ్చిన బియ్యంలో పురుగులు ఉండటంతో అవి సమీప కాలనీలకు చేరుతున్నాయని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు, తాగునీటిలో పురుగులు పడుతున్నాయని వారు వాపోయారు. పురుగుల నివారణకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని గోదాము మేనేజర్ సుమన్ స్పష్టం చేశారు.