విఘ్నేశ్వరుని పూజలో భక్తిపారవశ్యంతో మునిగిన కడ్తాల్ పల్లెసీమ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కడ్తాల్
కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని పూజా మహోత్సవంలో కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణపతి స్వామి దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసిద్ధిల్లి, శాంతి సమృద్ధి నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.