ప్రేమ నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రేమ వేధింపులను తిరస్కరించిందనే కోపంతో 19 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. శాస్త్రిపురంలో స్కూటర్‌పై వెళ్తున్న యువతిని అడ్డగించిన నిందితుడు ఓంకార్, ఆమెను కిందపడేసి విచక్షణారహితంగా కొట్టి కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.