లక్షెట్టిపేట సబ్ జైలులో ఉచిత వైద్య శిబిరం: ఖైదీలకు ముమ్మర పరీక్షలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్షెట్టిపేట

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని సబ్ జైలులో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనిల్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. జైలులోని విచారణ ఖైదీలకు రక్తపోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.