అర్నబ్ తుపాను బీభత్సం: సముద్రంలో నిలిచిపోయిన భారీ కార్గో నౌక

రిపోర్టర్: అశోక్ స్థలం: విశాఖపట్నం

అర్నబ్ తుపాను ధాటికి విశాఖ తీరంలో మార్షల్ ఐలాండ్కు చెందిన భారీ కార్గో నౌక సిగ్మా పెరల్ సముద్రంలో నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా కేజీ బేసిన్ వద్ద చిక్కుకున్న నౌకలోని ఆరుగురు సిబ్బందిని కోస్ట్ గార్డ్ అధికారులు సురక్షితంగా కాపాడారు. మరోవైపు తుపాను ప్రభావం క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.