ట్రావెలింగ్లో డబ్బు సంపాదన: ప్రయాణాన్ని బిజినెస్గా మలిచిన విజయవాడ యువతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయవాడ

ప్రయాణాన్ని డబ్బు సంపాదించుకునే మార్గంగా మలచవచ్చని విజయవాడకు చెందిన విశ్రుతి ఎల్లపు నిరూపించారు. ప్రయాణికుల ద్వారా వస్తువులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసేలా 'బ్రింగ్' అనే సేవలను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఆధునిక సాంకేతికతను జోడించి 2024లో ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. పార్శిళ్లు పంపేవారికి, తీసుకెళ్లేవారికి వారధిగా నిలుస్తూ ప్రయాణ ఖర్చులు భర్తీ చేసుకునేలా వినూత్న వ్యాపారానికి శ్రీకారం చుట్టడం విశేషం.