టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక వసతుల కల్పనకు భారీ ప్రతిపాదనలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలోని టిడ్కో గృహ సముదాయాల్లో నివసిస్తున్న ప్రజల సామాజిక అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పోలీసు ఔట్‌పోస్టులు, ప్రాథమిక పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు రూ.626 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. 2017లో తెదేపా హయాంలో ప్రారంభమైన ఈ ఇళ్లలో వేల మంది నివసిస్తుండగా, వసతుల లేమిని తొలగించేందుకు ఈ చర్యలు చేపట్టారు.