వర్ధన్నపేట పోస్టుమార్టం గదిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న డాక్టర్ భరత్

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేటలోని సంగెపు వాగు వద్ద ఉన్న ప్రభుత్వ పోస్టుమార్టం గదిని నూతన ఇన్చార్జి సూపరిండెంట్ డాక్టర్ భరత్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా పనులను పరిశీలించారు. ఇప్పటికే ఫ్రీజర్ ఉంచామని, మరో రెండు రోజుల్లో నీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. మున్సిపల్ అధికారుల సహకారంతో గది చుట్టూ పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.