జన్నారంలో అత్యవసర వైద్య సేవలు అందించే 108 అంబులెన్స్ తనిఖీ

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

అత్యవసర అంబులెన్స్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని 108 అంబులెన్స్ సర్వీస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొండల్ రావు కోరారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని 108 మరియు 102 అంబులెన్స్ వాహనాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది మునీందర్ గౌడ్, పరమేశ్వర్, రవికుమార్ పాల్గొన్నారు.