యువత కేరింతలతో పులకించిన గాయత్రీయన్స్ ఫ్రెషర్స్ వేడుకలు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని వి.వి.ఆర్. గార్డెన్లో శ్రీ గాయత్రీ కళాశాల ఆధ్వర్యంలో శ్రీ గాయత్రీయన్స్ సింఫోనియా–ఫ్రెషర్స్ పార్టీ శనివారం ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ బండారు మయూర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్య సాధనకు కష్టపడి చదవాలని సూచించారు. కరస్పాండెంట్ భీమిడి సుభాష్రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు కెరీర్ మార్గదర్శకత్వం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు.