రజాకార్ల విముక్తి నుంచి పేదరిక, నిరుద్యోగ విముక్తి వైపు : డా శివ ప్రసాద్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నాంపల్లి

తెలంగాణ చరిత్రలో రజాకార్ల నిరంకుశ పాలన నుంచి విముక్తి చారిత్రాత్మకమని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివ ప్రసాద్ అన్నారు. ఆనాటి స్ఫూర్తితో ప్రజల జీవితాల్లో సంపూర్ణ మార్పు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. పేదరికం, అనారోగ్యం, నిరుద్యోగం నుంచి విముక్తి లభించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వైద్యం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ, ఇదే మన భవిష్యత్తు లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.