'తరతరాల సంప్రదాయం': నేలపట్ల గ్రామంలో ఉత్సాహంగా ఉట్టి ఉత్సవం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని నేలపట్ల గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ముగిసిన మూడు రోజుల తర్వాత ఉట్టి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో యాదవ సోదరులు, యువకులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఉట్టిని పగలగొట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నగేష్గౌడ్ మాట్లాడుతూ.. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. యువత ఇలాంటి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని మన సంస్కృతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.