బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు: శ్యామ్ ప్రసాద్ లాల్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

నగరంలో బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాన రేషనింగ్ అధికారి జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ హెచ్చరించారు. హైదరాబాద్ లో బియ్యం లభ్యతపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. లాభాల కోసం సరుకును అక్రమంగా నిల్వ చేస్తే శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దుకాణాల్లో స్టాక్ బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.