కర్నూలులో ఉద్రిక్తత: పోలింగ్ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లాలో పోలింగ్ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల హౌస్ అరెస్ట్ కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవి, శిల్పా చక్రపాణి రెడ్డి తో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారని నాయకులు మండిపడ్డారు. ఓటు హక్ కు వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేయగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం చూసి భయపడే ఇలా నిర్బంధిస్తున్నారని శిల్పా రవి ధ్వజమెత్తారు.