నెల్లూరు జిల్లాలో నాన్ జ్యుడిషియల్ స్టాంపుల తీవ్ర కొరత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో నాన్ జ్యుడిషియల్ స్టాంపుల కొరత తీవ్రమైంది. రాష్ట్రవ్యాప్తంగా సరఫరా నిలిచిపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపులు దొరకని పరిస్థితి ఏర్పడింది. నాలుగైదు నెలలుగా సరఫరా లేకపోవడంతో వెండర్లకు స్టాంపులు ఇవ్వడం ఆపేశారు. అఫిడవిట్లు, ఒప్పందాలు, లీజుపత్రాల కోసం వచ్చే కక్షిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.