రేవంత్ ఎన్ని డైవర్షన్ డ్రామాలు ఆడినా రైతుల తరపున కొట్లాడతాం
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
ఇరవై రెండు ఏ నిషేధిత భూముల పేరిట దందాలు, కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణాలను నిలదీస్తున్నందుకే సీఎం రేవంత్ రెడ్డి చిల్లర డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్ని డ్రామాలు ఆడినా సరే, రైతులు మరియు ప్రజల పక్షాన నిరంతరం కొట్లాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.