భారత్ 6జీ కూటమి సంచలనం: ఏడు వేలకు పైగా పేటెంట్లు నమోదు

రిపోర్టర్: శివ స్థలం: గుంటూరు

టెక్నాలజీని అందిపుచ్చుకోవడం నుంచి సృష్టించే స్థాయికి భారత్ చేరుకుందని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ - కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ వెల్లడించారు. మూడో అంతర్జాతీయ భారత్ 6జీ సదస్సులో ఆయన ఈ కీలక విషయాలను స్పష్టం చేశారు. భారత్ 6జీ కూటమి సభ్యులు విదేశాల్లో సగానికి పైగా సహా ఏడు వేల ఏడు వందలకు పైగా పేటెంట్లను దాఖలు చేశారని తెలిపారు. ఏ దేశమూ ఒంటరిగా 6జీ ని నిర్మించలేదని, భారత్ అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.