లక్కవరం రహదారిపై నేలకూలిన చెట్లు స్తంభించిన రాకపోకలు

రిపోర్టర్: fast news స్థలం: జంగారెడ్డిగూడెం

జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం - దేవులపల్లి ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై రెండు భారీ వృక్షాలు ఒక్కసారిగా నేలకూలడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే లక్కవరం ఎస్సై జాబీర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వయంగా పర్యవేక్షిస్తూ చెట్లను తొలగించి, ట్రాఫిక్ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.