సినిమా అప్డేట్: నవంబర్ 20న థియేటర్లలోకి రానున్న డానీ చిత్రం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
డైరెక్టర్ కళ్యాణ్జీ గోగణ, హీరో ఆశిష్ గాంధీ, నిర్మాత రిజ్వాన్ కాంబినేషన్ లో వస్తున్న డానీ సినిమా నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. నాటకం సినిమాతో సంచలనం సృష్టించిన ఈ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయని, ఇదొక కల్ట్ వైల్డ్ డ్రామాగా ప్రేక్షకులను అలరిస్తుందని హీరో ఆశిష్ గాంధీ ఈ సందర్భంగా తెలిపారు.